Header Banner

ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త! ఇకపై మీ నగదు విత్‌డ్రా సులభతరం ఇలా!

  Thu Mar 06, 2025 09:31        Others

ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరే శుభవార్త. తమ ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బులను ఇకపై చాలా ఈజీగా విత్ డ్రా చేసుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా ఈపీఎఫ్ విత్ డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. అతి త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.


ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) నుంచి నగదు విత్ డ్రా ఇకపై చాలా ఈజీగా చేయవచ్చు. బ్యాంక్ అకౌంట్లో నుంచి తీసుకునే మాదిరిగానే ఈపీఎఫ్ ఖాతాలోని నగదును సైతం ఉపసంహరణ చేసుకునే కొత్త సదుపాయం అందుబాటులోకి రాబోతోంది. ఏటీఎం కేంద్రాలతో పాటుగా ఫోన్ పే, గూగుల్ పే వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) యాప్స్ ద్వారా కూడా ఈపీఎఫ్ ఖాతాలోని నగదును ఉపసంహరించుకునే వెసులుబాటు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం పీఎఫ్ ఖాతాలోని నగదు తీసుకునేందుకు కొన్ని రోజుల పాటు సమయం పడుతోంది. దరఖాస్తు తిరస్కరణకు గురైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నగదు విత్ డ్రాను సులభతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!


పీఎఫ్ విత్ డ్రా సులభతరం చేసే ప్రక్రియలో భాగంగానే ఏటీఎం ద్వారా నగదు విత్ డ్రాకు అవకాశం కల్పిస్తామని ఇటీవలే కేంద్రం కార్మిక శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఈ ఏడాది జూన్ నెల నాటికి ఈ ఏటీఎం నగదు విత్ డ్రా సదుపాయం అందుబాటులోకి రాబోతోందని పేర్కొన్నారు. దీంతో పాటుగా యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రాకు సంబంధించిన కసరత్తు సైతం జరుగుతోంది. ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్‌తో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.


ఈ ఏడాది మే లేదా జూన్ నెల నాటికి యూపీఐ ద్వారా ఈపీఎఫ్ నగదు ఉపసంహరణ సదుపాయం సైతం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. అదే జరిగినట్లయితే ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా నగదును బదిలీ చేసుకునే వీలు కలుగుతుంది. అయితే, గరిష్ఠంగా ఎంత మేర నగదు తీసుకోవచ్చు, ఏమైనా పరిమితిలు ఉంటాయా? వంటి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తారని తెలుస్తోంది. ఇలాగ నగదు విత్ డ్రా సులభతరం చేయడం వల్ల అత్యవసర సమయాల్లో పీఎఫ్ సొమ్ము చాలా మందికి ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది. అయితే, ఇష్టారీతన పీఎఫ్ నగదు విత్ డ్రా చేస్తే అసలు ఉద్దేశం దెబ్బతినే అవకశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #EPFUpdates #PFWithdrawal #UPIPayments #PhonePe #GooglePay #DigitalIndia #ATMWithdrawal #EPFNews #FinancialFreedom #EasyWithdraw